Published On:

PM Modi Orders to Army: పాక్ తూటాలకు ఫిరంగులతో సమాధానమివ్వండి: ప్రధాని మోదీ!

PM Modi Orders to Army: పాక్ తూటాలకు ఫిరంగులతో సమాధానమివ్వండి: ప్రధాని మోదీ!

PM Modi Orders to India Army Amid India Pakistan War:  ఓపిక నశించింది. దశాబ్దాలపాటు సాగుతోన్న పాక్ ఉగ్ర చేష్టలకు సమాధానమివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశం విడిపోయినప్పటినుంచి అక్కసుతో రగులుతోన్న పాక్ కు గట్టిసమాదానమే లభించనుంది. అందులో భాగమే ప్రధాని మోదీ తాజా నిర్ణయం. పాక్ వైపు నుంచి ఒక్క తూటా పేలినా  ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ‘వాహా సే గోలి చలేగి, తో యహన్ సే గోలా చలేగా (వారు బుల్లెట్లను పేల్చితే, మేము ఫిరంగులతో స్పందిస్తాము)’ అని అన్నారు.

 

భారత సైనిక శక్తి ముందు పాకిస్తాన్ తట్టుకోలేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసొచ్చింది. ఉగ్రవాదులు ఏమూల నక్కినా సురక్షితంగా లేరని భారత్ తెలియజేసింది. పాకిస్తాన్ ఆర్మీలో ఉగ్రవాదుల కుటుంబాలు ఉండటం ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచింది. అయితే ప్రధాని మాత్రం ఉగ్ర చర్యలు ఎక్కడ సాగినా ఘర్ మె ఘుస్ కే మారేంగ్ ( ఉగ్రవాదుల ఇంట్లో చొరబడి కొడతాం ) అని వార్నింగ్ ఇచ్చారు.

 

భారతదేశం తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుటుందని చెప్పారు ప్రధాని మోదీ. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ కు తెలియపరిచారు. భారత్ పాక్ మధ్య ఏ దేశ మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. పాకిస్తాన్ ఇకపై దాడిచేస్తే భారత్ ఊహించని విధంగా పాక్ ను నేలమట్టం చేస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో ప్రతీ రౌండ్ లో పాక్ ను భారత్ ఓడించిందన్నారు. పాక్ ఏవిషయంలోనూ భారత్ తో పోటీపడలేదన్నారు.

 

కార్గిల్ సమయంలో కూడా పాకిస్తాన్ అమెరికా సహాయం తీసుకుని విరమణకు ఒప్పందం చేసుకుందన్నారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ పశ్చిమ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చామన్నారు. పాకిస్తాన్ ఏమాత్రం తోకజాడించినా భీకరంగా విరుచుకుపడతామన్నారు.