Published On:

Harish Rao : కేటీఆర్‌కు నాయకత్వ పగ్గాలిస్తే తప్పకుండా స్వాగతిస్తా.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao : కేటీఆర్‌కు నాయకత్వ పగ్గాలిస్తే తప్పకుండా స్వాగతిస్తా.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

Former Minister Harish Rao sensational comments : కారు పార్టీలో వర్గ విభేదాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌లో ఎలాంటి వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. ఆయన ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని తెలిపారు. రాముడికి హనుమంతుడిలాగా కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ మాటే హరీశ్ బాట అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గీత దాటే ప్రసక్తే లేదన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..
అంతకుముందు కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: