Published On:

Samantha: గురూజీ దర్శకత్వంలో సామ్.. ?

Samantha: గురూజీ దర్శకత్వంలో సామ్.. ?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా తెలుగుతెరకు దూరమైన విషయం తెల్సిందే. శాకుంతలం సినిమాలో సామ్ చివరిసారి కనిపించింది. దీని తరువాత ఆమె మయోసైటిస్ బారిన పాడడం, చికిత్స కోసం దేశాలు తిరగడం సరిపోయింది. ఆ తరువాత ఒక ఏడాది పాటు సినిమాలకు దూరమవుతున్నట్లు సామ్ ప్రకటించింది. గతేడాదితో ఆ ఏడాది పూర్తయ్యింది.

 

ఇక ఈ ఏడాది నుంచే సామ్.. సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అయితే తెలుగులో కాకుండా సామ్.. హిందీపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఇప్పుడు మరో సిరీస్ ను చేయబోతుంది. సామ్.. ఎప్పుడెప్పుడు తెలుగుతెరపై మరోసారి కనిపిస్తుందో అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సామ్ ను అభిమానులే కాదు.. డైరెక్టర్ గురూజీ కూడా మిస్ అవుతున్నాడు.

 

గతంలో ఒక ఈవెంట్ లో సమంత .. తెలుగు సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు సమంత.. తన కోసం ఒక కథను రాయమని కోరింది. ఇప్పుడు త్రివిక్రమ్ ఆ మాటను నిజం చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో అల్లు అర్జున్ సినిమా ఉంది. ఇది ఇప్పుడప్పుడే పట్టాలు ఎక్కేలా లేదు. ఈలోపు వెంకటేష్ తో ఒక సినిమా చేయనున్నాడని టాక్ నడిచింది. అది సెట్స్ పై వెళ్ళడానికి టైమ్ పడుతుందని అంటున్నారు.

 

ఇక ఈ లోపు సామ్ కోసం ఒక లేడీ ఓరియెంటెడ్ కథను రాసే పనిలో పడ్డాడట గురూజీ.  ఈ కథను త్వరగా పట్టాలెక్కించి ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట. ఇప్పటివరకు గురూజీ కలం నుంచి లేడీ ఓరియెంటెడ్ మూవీ వచ్చింది లేదు. మరి సామ్ కోసం గురూజీ ఎలాంటి కథను రాస్తాడో చూడాలి.