Published On:

PM Modi on POK: పీఓకేను భారత్ కు అప్పగించాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

PM Modi on POK: పీఓకేను భారత్ కు అప్పగించాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

PM Modi said POK Belongs to India during Operation Sindoor: దేశ త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ మధ్య దాడుల అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అనంతరం భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు గాను ప్రధాని మోదీ నివాససంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. భేటీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే.. భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని ఇందులో ఎలాంటి మార్పు లేదని స్ఫష్టం చేశారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తెలిపారు.

 

కాగా దీనిపై త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరీ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే.. పీవోకేను భారత్ కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడే అంశంలేదని చెప్పారు. పీఓకే అంశంపై ఎవరూ మాట్లాడినా ఊరుకునేదిలేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడుతామని అన్నారు.