PM Modi Meets NSA, CDS: ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ.. కీలక అంశాలపై చర్చ!

PM Modi Meeting with NSA, CDS on India Pakistan War: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ప్రధాని నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం, ఈ విషయంపై అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాలు సరిహద్దుల్లో నెలకొన్ని పరిస్థితిపై సైతం చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని ప్రధాన అధికారులత భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.