Published On:

PM Modi Salutes to army: మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది: ప్రధాని మోదీ

PM Modi Salutes to army: మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది: ప్రధాని మోదీ

Prime Minister Modi Salutes to Indian Army: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా మన సైన్యం చావుదెబ్బకొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సైనికులకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు.

 

శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది..

గడిచిన నాలుగు రోజులుగా ఇండియా సైన్యం సామర్థ్యం, సంయమనాన్ని చూస్తున్నామని చెప్పారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని భారత్ చూసిందన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసిందని పేర్కొన్నారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికే తలమానికమన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరి అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్నారు. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం చలించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది..

ప్రజలు, అన్నీ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని కొనియాడారు. భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్‌ సిందూర్‌.. ఆప‌రేష‌న్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేద‌న అన్నారు. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయని తెలిపారు. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందన్నారు. పాకిస్థాన్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశామన్నారు. పాక్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని ఇండియా తీసుకొచ్చిందన్నారు. ఇండియా చర్యలకు బెంబేలేత్తిపోయిన పాక్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాకిస్థాన్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారని తెలిపారు.

 

చావు దెబ్బ కొట్టేందుకు భారత్‌ దళాలు సిద్ధం..

ఎలాంటి దాడులకు పాకిస్థాన్ తెగబడినా ఇండియా దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలాకోట్ దాడులు, ఆపరేషన్‌ సిందూర్‌, ఉగ్రవాదంపై భారత్‌ తమ వైఖరిని విస్పష్టంగా చెప్పాయన్నారు. ఉగ్రవాదంపై షరతుల మేరకే చర్చలు ఉంటాయని, ఇండియా నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని పేర్కొన్నారు. పాక్ అణు బ్లాక్‌మెయిలింగ్‌‌ను సహించేది లేదని స్పష్టం చేశారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఇండియా ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్‌ తుదముట్టించి తీరుతుందని ప్రధాని ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి: