Kenishaa Francis: నా ముఖంపై చెప్పండి.. పీఆర్ స్టంట్స్ చేయకండి.. హీరో భార్యపై సింగర్ ఫైర్

Kenishaa Francis: కోలీవుడ్ స్టార్ హీరో రవి విడాకుల విషయం ఎంత రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి – ఆర్తి.. ఈ మధ్యనే విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన ఈ జంట.. కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. రవి – ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. విడాకులు తీసుకుంటున్న విషయం తనకు చెప్పకుండా రవి సోషల్ మీడియాలో అందరికీ ప్రకటించడాని, ఇది అన్యాయమని తెలిపింది.
ఇక విడాకులు విషయంలో రవి.. సింగర్ కేనీషాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఆమె వలనే వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలను కేనీషా ఖండించింది. అలాంటివేమీ లేవని, తన పేరును నాశనం చేయొద్దని కోరింది. ఇక ఈలోపే.. రవి – కేనీషా కలిసి ఒక పెళ్ళికి హాజరవడం సంచలనంగా మారింది. వీరిద్దరూ కలిసి కనిపించడంతో నిజంగానే ఈ జంట మధ్య ఎఫైర్ ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్తి.. ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టుకొచ్చింది. ” ఇవాళ ఒక భార్యగా, ఒక మహిళగా మాట్లాడట్లేదు ఓ తల్లిగా బిడ్డల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నేను ఓడిపోతాను. నువ్వు ఈజీగా వెళ్ళిపోయి వేరే వాళ్లతో ఉంటావు. నన్ను రీప్లేస్ చేస్తావు. కానీ తండ్రిగా నీ బాధ్యత, నీ గుర్తింపును మాత్రం చెరిపేయలేవు. మన పిల్లల ఏడ్పులు నీకు కనిపించవు” అంటూ భర్తను ఉద్దేశించి రాసుకొచ్చింది.
ఇక ఆర్తి పోస్ట్ పై మహిళలు, హీరోయిన్స్ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. స్ట్రాంగ్ గా ఉండాలని కోరారు. తాజాగా కేనీషా స్పందించింది. ఏదైనా ఉంటే తన ముఖంపై చెప్పాలని, ఇలా పీఆర్ స్టంట్స్ చేయొద్దని ఫైర్ అయ్యింది. ” నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడండి. నా ముఖంపై చెప్పండి. అలా చెప్తే మీ మనసులో ఏముంది.. నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాక్కూడా తెలుస్తుంది. ఇలా పీఆర్ లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోకుండా నాపై కేకలు వేస్తున్నవారు నా ముందుకు రండి. వేరేవారి విషయాలపై శ్రద్ద చూపించడం, ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూసే మీలాంటివారికి దన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.