Last Updated:

Chiranjeevi: తమన్‌ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్‌ – నీలో ఇంత ఆవేదన ఉందా!

Chiranjeevi: తమన్‌ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్‌ – నీలో ఇంత ఆవేదన ఉందా!

Chiranjeevi Reacts on Thaman Comments: నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు. మన సినిమానే మనమే చంపేసుకుంటున్నామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఇచ్చిన ఎమోషనల్‌ స్పీచ్‌ తనని కదిలిచిందన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. తమన్‌ కామెంట్స్‌పై తాజాగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

“డియర్ తమన్‌.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ నీ మనసు ఎంత కలత చెంది ఉంటే ఇంతలా ఆవేదనకు గురయ్యారో మీ మాటల్లో అర్థమవుతుంది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది” అని ఆయన రాసుకొచ్చారు.

కాగా శుక్రవారం నిర్వహించిన డాకు మహారాజ్‌ సక్సెస్‌ మీట్‌లో థమన్‌ మాట్లాడుతూ.. మనం ఏం బతుకు బతుకుతున్నామో అర్థం కావడం లేదు. ఒక సినిమా సక్సెస్‌ అయితే దానిని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. మన సినిమాను మనమే చంపుకుంటున్నాం. సినిమా అనేది చాలా గొప్పది. మీరు వ్యక్తిగతంగా కొట్టుకుచావండి. కానీ సినిమాని చంపకండి. ఎందుకు ఇంత వ్యతిరేకత. మన డైరెక్టర్స్‌ని మన తెలుగు సినిమాలను ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెబుతున్నారు.

విదేశాల్లోనూ మన సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. మన సినిమాను గర్వంగా ఎక్కడికో తీసుకువెళుతున్నారు. సినిమాను కాపాడుకోవడం మనందరి బాధ్యత. సినిమా బాగా లేకపోతే ఒకే. వాటి నుంచి నేర్చుకుంటాం. కానీ నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం వల్ల ఒక సినిమా సక్సెస్‌ అయ్యిందని గర్వంగా కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో దురద్రష్టకరం. ఎందుకు సినిమాపై అంత ద్వేషం చూపిస్తున్నారు. ఇకనైనా నెగిటివిటీ వ్యాప్తి చేయడం ఆపండి” అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఇవే కామెంట్స్‌పై స్పందిస్తూ తమన్‌ మాటలకు తన కళ్లల్లో నిళ్లు తిరిగాయన్నారు చిరు.