Maruti Suzuki Dzire Sales: కొనసాగుతున్న డిజైర్ హవా.. సెడాన్ సెగ్మెంట్‌ను శాసిస్తోన్న ఏకైక కారు

Maruti Suzuki Dzire Became No 1 in April Sales: దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకి డిజైర్ రెండవ స్థానంలో ఉండగా, హ్యుందాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉంది. కానీ డిజైన్ సెడాన్ కార్ల విభాగంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అదే విభాగానికి చెందిన హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్‌లు అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో కూడా చోటు దక్కించుకోలేకపోయాయి. మారుతి సుజుకి డిజైన్ గత నెలలో 16,996 యూనిట్లను విక్రయించింది. దీనికి భద్రత పరంగా 5 స్టార్ రేటింగ్ లభించింది. డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.84 లక్షల నుండి ప్రారంభమవుతుంది. డిజైర్ ఇంజిన్ నుండి దాని ఫీచర్ల వరకు తెలుసుకుందాం.
Maruri Suzuki Dzire Engine
మారుతి డిజైర్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 82 పిఎస్ పవర్, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-మాన్యువల్,5-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లకు జతచేసి ఉంటుంది. అదే సమయంలో, దాని సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఆప్షనల్ హైబ్రిడ్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో దీని మైలేజ్ లీటర్‌కు 24.79 కి.మీ. సిఎన్‌జి మోడ్‌లో ఇది కిలోకు 34 కి.మీ మైలేజీని ఇస్తుంది.
Maruri Suzuki Dzire Safety
భద్రత కోసం, ఈ కారులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. ఇది కాకుండా, 3 పాయింట్ల సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఇన్‌స్టాల్ చేశారు. ఈ కారులో చాలా స్థలం ఉంది. ఇందులో 5 మంది కూర్చోవచ్చు.
మారుతి సుజుకి డిజైర్ నేరుగా హోండా అమేజ్‌తో పోటీపడుతుంది. అమేజ్ 1.2 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 90 పిఎస్ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, CVT ట్రాన్స్మిషన్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 18.65 కిలోమీటర్లు, CVTతో లీటరుకు 19.46 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 పాయింట్ల సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్, బ్రేక్ అసిస్ట్, బ్రేక్ ఓవర్‌రైడ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ.8 లక్షల నుండి ప్రారంభమవుతుంది.