Published On:

Arjun Son of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రివ్యూ.. ఆ సీన్లే మెయిన్ హైలెట్.. టాక్ ఎలా ఉందంటే..?

Arjun Son of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రివ్యూ.. ఆ సీన్లే మెయిన్ హైలెట్.. టాక్ ఎలా ఉందంటే..?

Arjun Son of Vyjayanthi Review: నందమూరి హీరో కల్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసనంలేవు. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిక్రియేట్ చేసుకున్నారు. అయితే కల్యాణ్ రామ్ హీరోగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. అతనొక్కడే,పటాస్, డేవిల్, 118, బింబిసార వంటి హిట్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. కల్యాణ్ రామ్ తాజాగా యంగ్ డైరెక్ట్ర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో ళసీనియర్ యాక్టర్, ఎమ్మెల్సీ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది.

 

సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటన సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కొన్ని యాక్షన్ సీన్లు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయని చాలామంది ట్వీట్ చేశారు. మరికొందరు క్లైమాక్స్ బాగుందని పేర్కొన్నారు. అయితే కొందరు కథ రొటీన్‌గా ఉందని, కొత్తదనం లేదని ట్వీట్‌ వేదికగా తమ విమర్శిస్తున్నారు.

 

మ్యూజిక్, VFX అనుకున్నంత స్థాయిలో లేవని కొంతమంది అభిప్రాయపడ్డారు. సినిమా మొదటి సగం సాదాసీదాగా ఉందని, మరి ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు జనతా గ్యారేజ్ సినిమాను గుర్తు చేస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంపై అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటీనటుల నటన, కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మదర్ సెంటిమెంట్ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు.