India Pakistan War: పాక్ దాడులతో ఉద్రిక్తతలు.. ఎయిర్‌లాంఛర్లను ధ్వంసం చేశాం: కల్నల్ సోషియా ఖురేషీ!

Colone Sofiya Qureshi Explains Pakistan’s Western Border Attack Plan: భారత వైమానిక సరిహద్దులు దాటి పాకిస్థాన్ దాడులు చేస్తోందని ఆర్మీ కల్నల్ సోషియా ఖురేషీ పేర్కొన్నారు. అయితే పాక్ దాడుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. దాడులపై పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. S-400 సిస్టమ్ ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ ప్రచారం చేస్తొందన్నారు. సోషల్ మీడియా ద్వారా పాల్స్ నేరేటివ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ సేనలు విచక్షణారహితంగా దాడులు చేస్తోందని వివరించారు. పాకిస్థాన్ వరుస దాడులతో నియంత్రణ రేఖలో ఉద్రిక్తతలు పెంచుతోందన్నారు.
అలాగే పాకిస్థాన్‌లోని గురుద్వారాలపై భారత్ దాడి చేసిందనేది అవాస్తవమని వివరించారు. అలాగే అఫ్గానిస్థాన్‌పైన భారత్ మిసైల్ ప్రయోగించిందనేది అబద్ధమన్నారు. పాక్ ఆర్మీ నిరంతరంగా పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోందన్నారు.
పాకిస్థాన్ డ్రోన్లు, లాంగ్ టార్గెట్ మిసైల్స్ వాడుతోందని, పాక్‌లోని పలు ఎయిర్ లాంఛర్లను ధ్వంసం చేసినట్లు వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ పేర్కొన్నారు. అలాగే ఫైటర్ జెట్‌లతో పాక్ కీలక స్థావరాలపై దాడులు చేశామన్నారు. కాగా, పాక్ రాత్రి 26 ప్రాంతాల్లో దాడులు చేశారన్నారు. ఫైటర్ జెట్లతో శ్రీనగర్, అవంతిపురా సహా పలు చోట్ల దాడులు జరిపిందని వివరించారు.
పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. భారత్‌లో ఎయిర్‌బేస్‌లు ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లలో పౌరులపై, పౌర మౌలిక సదుపాయాలపై పాక్ దాడులు చేస్తుందన్నారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని వెల్లడించారు. పాక్ కావాలనే వ్యూహాత్మకంగా ఉద్రిక్తతలను పెంచుతోందని, భారత్ బాధ్యతాయుతంగా ప్రతిస్పందిస్తోందన్నారు.
భారత్‌లో ఉద్రిక్తతలు పెంచుకుంటూ భంగపాటుకు గురవుతున్న పాకిస్థాన్‌కు స్వదేశంలో మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. అక్కడ దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం. దీంతో రాజధాని నగరమైన ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంక్‌లు అన్నింటినీ మూసివేయాలని నిర్ణయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నేటి నుంచి రాబోయే 48 గంటల పాటు ఇస్లామాబాద్‌లోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది.