Chaurya Paatam Trailer: జేమ్స్ బాండ్ చూస్తే ప్యూజులు ఎగిరిపోవాల్సిందే.. ఆసక్తి రేపుతున్న చౌర్య పాఠం ట్రైలర్..!

Chaurya Paatam Trailer: స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై చౌర్య పాఠం అనే సినిమాను నిర్మిస్తున్నారు. క్రైమ్-కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తుండగా.. ఇంద్రా రామ్ హీరోగా తెలుసు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. అలానే రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ చూసినట్లయితే.. ధనపల్లి అనే గ్రామంలో బ్యాంక్ దొంగతనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. దొంగతనానికి వెళ్లిన ముఠాకు అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే కథ. ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. హీరో ఇంద్రరామ్ తనకు మొదటి సినిమా అయినా.. తన నటనతో ఆకట్టుకున్నాడు. సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా గొప్పగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను త్రినాథరావు నక్కిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ట్రైలర్‌తో మేకర్స్ అంచనాలు పెంచేశారు. సెన్సార్ పూర్తవ్వగానే ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి వస్తుంది.