Last Updated:

Manchu Manoj: విస్మిత్‌ నువ్వు కూడా క్యూట్‌గా ఉన్నావ్‌, కూర్చొని మాట్లాడుకుందాం.. ఏమంటావ్‌?!: మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌

Manchu Manoj: విస్మిత్‌ నువ్వు కూడా క్యూట్‌గా ఉన్నావ్‌, కూర్చొని మాట్లాడుకుందాం.. ఏమంటావ్‌?!: మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌

Manchu Manoj Latest Tweet: గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు వార్తల్లో నిలుస్తున్నాయి. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్నకలహాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంచు మనోజ్, మోహన్‌ బాబులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మంచు వారి ఫ్యామిలీ వివాదాలు బట్టబయలయ్యాయి. హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి ముందు గతేడాది డిసెంబర్‌లో జరిగిన గొడవలు, వాగ్వాదాలు అందరికి తెలిసిందే. అయితే వారం రోజులు పాటు సాగిన వారి గోడవలు ఆ తర్వాత సద్దుమణిగాయనిపించాయి. కానీ కొత్త సంవత్సరం సంక్రాంతికి మళ్లీ మంచు ఫ్యామిలీలో గొడవలు రాజుకున్నాయి.

మనోజ్‌ తన భార్య మౌనికతో కలిసి తిరుపతి రాగా.. అతడిని మోహన్‌ బాబు యూనివర్సిటీలోకి అనుమతించలేదు. దీంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీకి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వివాదాల నడుమ మంచు విష్ణు చేసిన ట్వీట్‌ చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత దానికి కౌంటర్‌గా మనోజ్‌ కూడా విష్ణ కన్నప్ప సినిమాని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్‌ వేశాడు. మంచు వారుసుల ట్విటర్‌ వేదికగా శునకం పంచాయతీ పెట్టుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీనిపై విష్ణు రియాక్షన్‌ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా చూస్తున్నతరుణంలో మనోజ్‌ మరో ట్వీట్‌ వదిలాడు. పవన్‌ కళ్యాణ్‌ అత్తారింటికి దారేది మూవీలోని పోస్టర్‌తో కుర్చోని మాట్లాడుకుందామంటూ ఇన్‌డైరెక్ట్‌ ట్వీట్‌ చేశాడు.

“విస్మిత్‌(#vismith) నవ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావ్‌.. మ్యాన్‌ టూ మ్యాన్‌, ఇంట్లో మహిళలు, నాన్న, సిబ్బంది, ఈ చక్కెర వాటన్నింటిని పక్కన పెడదాం. కూర్చోని మాట్లాడుకుందాం. ఏమంటావ్‌?! మ్యాన్‌ అప్‌ విస్మిత్‌. నేను ఒంటరిగా వస్తానని మాటిస్తున్నా. నువ్వు ఎవరినైనా తెచ్చుకో లేదా బహిరంగంగా కూర్చొని ఆరోగ్యకరమైన చర్చ జరుపుదాం” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీంతో మనోజ్‌ ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ ఈ ట్వీట్‌ ఎవరి కోసం చేశాడనేది మాత్రం మనోజ్‌ స్పష్టం చేయలేదు. చూస్తుంటే ఇది తన అన్నయ్య మంచు విష్ణును ఉద్దేశించి చేశాడని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. విష్ణుతో సంధి కుదుర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఈ ట్వీట్‌ ద్వారా తెలిపాడంటున్నారు. మరి దీనిపై మంచు విష్ణు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.