Chiranjeevi: నటనలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లు నాకు స్ఫూర్తి: చిరంజీవి

Chiranjeevi Said He Inspired From Amitabh Bachchan and Kamal Haasan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైనర్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో చిరు పాల్గొన్నారు. ‘వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్)’ గురువారం ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కి చెందిన అగ్ర నటీనటులతో పాటు దక్షిణాది నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వీరంతా వేవ్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సమ్మిట్‌కు పాల్గొని తన అభిప్రాయాలను, సలహాలు, సూచనలను ఇచ్చారు. తొలిరోజు జరిగిన ఈ సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలువురు నటులపై ప్రశంసలు కురిపించారు. తనకు ఒక్కొనటుడు ఒక్కొ విషయంలో స్పూర్తినిచ్చారని చెప్పారు. “నా బాల్యంలో నేను డ్యాన్స్ చేసి నా కుటుంబం,స్నేహితులను అలరించేవాడిని. అలా నాకు నటనపై ఆసక్తి మొదలైంది. అదే ఇంట్రెస్ట్‌తో చెన్నై వెళ్లాను. అప్పటికే ఇండస్ట్రీలో చాలామంది లెజండరీ నటులు ఉన్నారు.
దీంతో నేను ఇలా అనుకునేవాడిని. ‘ఇప్పటికే ఇక్కడ ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇంకా అదనంగా నేనేం చేయగలను అనుకునేవాడిని. కానీ, ఎలాగైన నాకంటూ ప్రత్యేకత గుర్తింపు పొంది అందరి దృష్టి ఆకర్షించాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. 1977లో నటనలో శిక్షణ పొందాను. ఆ సమయంలో మేకప్ లేకుండ సహజంగా నటించాలని మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్‌ని, డ్యాన్స్ విషయంలో కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు.