Shivangi OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘శివంగి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Shivangi OTT Release: ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. సత్యభామగా ఆనంది.. పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి తమ నటనతో మెప్పించారు. నరేష్‌బాబు నిర్మాణంలో దేవరాజ్ భరణీధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతేడాది మార్చి 7న విడుదల కాగా, ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సత్యభామ ఓ సాధారణ గృహిణి. ఓ వైపు భర్త ఆరోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి ఆనందిని. మరోవైపు అత్త వేధింపులు.. అలానే ఓ రోజు తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత కథలోకి వరలక్ష్మీ శరత్‌కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా ‘ఆహా’లో చూడాల్సిందే..!