AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
Amaravati: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది.
టీడీపీ సభ్యులు పోడియం వద్ద నుంచి వెనెక్కి వచ్చి అడగాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లును వెనెక్కి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎన్టీఆర్ జోహర్, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ గురిచి మాట్లాడే హక్కు కేవలం బుచ్చియ్య చౌదరికే ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మధ్యలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని, అందుకే ఆయన పేరు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
టీడీపీ సభ్యులు ఆందోళనలతో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను కొంత సమయం వాయిదా వేశారు. వాయదా అనంతరం సభ ప్రారంభమయిన తరువాత కూడ టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. పేపర్లు చింపి స్పీకర్ పైకి విసిరారు. దీనితో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 13 టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్ చేసారు.