IPL 2025: బెంగళూరు భారీ స్కోరు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

Royal Challengers Bangalore High Score to Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(32) దూకుడుగా ఆడుతుండగా.. కీపర్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. నూర్ బౌలింగ్‌లో స్టంపింగ్ కళ్లు తెరిచి మూసేంతలో ధోనీ వికెట్లను పడగొట్టాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చి వేగంగా ఆడుతున్న దేవ్‌దత్(24) అశ్విన్ వేసిన అద్భుతమైన బంతికి ఔట్ అయ్యాడు. ఇక, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి(31) రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్(10) క్లీన్ బౌలర్డ్ అయ్యాడు. ఖలీల్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ(12) జడేజాకు క్యాచ్ ఇవ్వగా.. పతిరానా బౌలింగ్‌లో రజత్ పటీదార్(51) సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అలాగే కృనాల్ పాండ్య డకౌట్ అయ్యాడు. చివరిలో టిమ్ డేవిడ్(22) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా, పతిరానా రెండు వికెట్లు, అశ్విన్, ఖలీల్ చెరో వికెట్ తీశాడు.