Last Updated:

IPL 2025: టాస్ ఓడిన ఆర్సీబీ.. బౌలింగ్ తీసుకున్న చెన్నై

IPL 2025: టాస్ ఓడిన ఆర్సీబీ.. బౌలింగ్ తీసుకున్న చెన్నై

CSK vs RCB , CSK Own the toss and opt to bowl first in IPL 2025: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

 

ఇరు జట్ల బలాల విషయానికొస్తే.. దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ గెలుపుపై అటు చెన్నై ఫ్యాన్స్‌తో పాటు బెంగళూరు ఫ్యాన్స్ భారీగా ఆశలు పెంచుకున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా టీంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది.

 

ఆర్సీబీలో ఒక మార్పు చేశారు. రసిక్ స్థానంలో భువనేశ్వరన్ కుమార్‌ను తీసుకున్నారు. ఈ మేరకు కెప్టెన్ రజత్ పటీదార్ మీడియాతో మాట్లాడారు. పిచ్ కొంచం హార్డ్‌గా కనిపిస్తుందన్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాపై మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారన్నారు. ఈ మ్యాచ్‌లోనూ అంతే చక్కగా ఆడతామని చెప్పారు.

 

చెన్నై సూపర్ కింగ్స్‌: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కరన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరన, ఖలీల్ అహ్మద్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లివింగ్ స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య, జోష్ హెజిల్ వుడ్, యశ్ దయాల్.

 

ఇక, ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికొస్తే.. చెన్నైలో శివమ్ దూబే, కమలేశ్ నాగర్ కోటి, విజయ్ శంకర్, జెమ్మీ ఓవర్టన్, షేక్ రషీద్ ఉండగా.. బెంగళూరులో సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలామ్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మనోజ్ బండాగే ఉన్నారు.