Published On:

IPL 2025 32nd Match: ఢిల్లీతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్

IPL 2025 32nd Match: ఢిల్లీతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్

Rajasthan Royals Own the Toss Opt to bowl Against Delhi Capitals: ఐపీఎల్‌ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

 

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. గత మ్యాచ్‌లో ముంబైతో ఓటమి చెందింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.  కాగా, ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో ఓటమి చెందాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి గెలుపు బాటపట్టాలని ఇరుజట్లు పట్టుదలో ఉన్నాయి.

 

ఇదిలా ఉండగా, ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ, రాజస్థాన్ మధ్య 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 15 మ్యాచ్‌లు గెలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీపై రాజస్థాన్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

 

ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్ దీప్ యాదవ్, మోహిత్ శర్మ.

రాజస్థాన్ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్ మయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.