Vivo V50 Elite Edition Launch: కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. కొనేముందు ఇది చూడు!

Vivo V50 Elite Edition expected to Launch on May 15th: టెక్ కంపెనీ వివో భారతదేశంలో Vivo V50 Elite Editionను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. దాని వెనుక కెమెరా మాడ్యూల్‌ను షేర్ చేసింది. ఫిబ్రవరిలో ప్రారంభించిన ప్రస్తుత వివో V50 లో పిల్ ఆకారపు వెనుక కెమెరా మాడ్యూల్ ఉండటం గమనించదగ్గ విషయం. అదే సమయంలో, రాబోయే ఎలైట్ ఎడిషన్‌లో గుండ్రని ఆకారంలో (వృత్తాకార) కెమెరా మాడ్యూల్‌ను చూడచ్చు. ఈ కొత్త వేరియంట్‌లోని చాలా ఫీచర్లు స్టాండర్డ్ వెర్షన్‌ను పోలి ఉంటాయని భావిస్తున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో Vivo V50e వేరియంట్ కూడా భారతదేశంలో విడుదల చేయవచ్చని చెబుతున్నారు.
Vivo V50 Elite Edition Launch Date
వివో V50 ఎలైట్ ఎడిషన్ మే 15న మధ్యాహ్నం 12 గంటలకు (IST) భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ X (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో వెల్లడించింది. దానితో పాటు షేర్ చేసిన వీడియోలో ఫోన్ వెనుక ప్యానెల్‌లో, దాని వెనుక కెమెరా మాడ్యూల్ క్రింద “ఎలైట్ ఎడిషన్” అని రాశారు. ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ గుండ్రని ఆకారంలో ఉండచ్చు, ఇది బేస్ వివో V50 పిల్ ఆకారపు మాడ్యూల్ నుండి భిన్నంగా ఉంటుంది. అయితే వివో V50 ఎలైట్ ఎడిషన్ గురించి కంపెనీ ఇంకా పెద్దగా సమాచారం పంచుకోలేదు. టీజర్ క్యాప్షన్ ప్రకారం ఈ ఫోన్ “మీ చుట్టూ ఉన్న సౌండ్, పోర్ట్రెయిట్‌లతో వస్తుంది – ఇది కేవలం ఫోన్ కాదు.”
Vivo V50 Elite Edition Features
వివో V50 ఎలైట్ ఎడిషన్ వెనిల్లా వివో V50 వేరియంట్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC, 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, Zeiss-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 50Mp సెల్ఫీ షూటర్ ఉండచ్చు.
వివో V50 IP68, IP69 డస్ట్, వాటర్ ఫ్రూప్ రేటింగ్‌లను పొందుతుందని పేర్కొన్నారు. దీనిలో 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్, 4,500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారంగా FuntouchOS 15తో వస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Vivo V50 Price
భారతదేశంలో ప్రారంభించినప్పుడు వివో V50 మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:
1. 8GB + 128GB – రూ.34,999
2. 8GB + 256GB – రూ.36,999
3. 12GB + 512GB – రూ.40,999
ఈ ఫోన్ మూడు కలర్స్‌లో లభిస్తుంది – రోజ్ రెడ్, స్టార్రి బ్లూ,టైటానియం గ్రే. ఎలైట్ ఎడిషన్ ధర, ఇతర వివరాలు లాంచ్ రోజున వెల్లడి కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- Motorola Edge 60 Stylus Massive Price Cut: ఊర మాస్ డీల్.. రూ. 711లకే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. లూట్ చేసేయండి!