Published On:

Zaheer Khan Blessed With Baby Boy: తండ్రైన క్రికెటర్ జహీర్‌ ఖాన్‌ – పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య!

Zaheer Khan Blessed With Baby Boy: తండ్రైన క్రికెటర్ జహీర్‌ ఖాన్‌ – పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య!

Team India Fast Bowler Zaheer Khan Blessed With Baby Boy: టీమిండియా మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ తండ్రియ్యారు. ఆయన భార్య సాగరిక ఘాట్గే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బాబు పేరును కూడా ప్రకటించారు.  “మీ ప్రేమ, కృతజ్ఞత.. దైవిక ఆశీర్వాదాలతో మేము మా అమూల్యమైన చిన్నారి ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము” అంటూ సాగరికి తన పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది.

 

ఈ మేరకు జహీర్‌ దంపతులు తమ కుమారుడితో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్‌ చేశారు. అయితే ఇందులో చిన్నారి ఫేస్‌ కనిపించకుండ వారు జాగ్రత్త పడ్డారు. బాబుకు ఫతేసిన్హ్‌ ఖాన్‌ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. దీంతో జహీర్‌ దంపతులకు సోషల్‌ మీడియాలో అభిమానులు, సన్నిహితుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

కాగా జహీర్‌ ఖాన్‌, సాగరికలు 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల డేటింగ్‌ తర్వాత ఒక్కటైన ఈ జంటకు పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత తొలి బిడ్డ జన్మనిచ్చింది. దీంతో జహీర్‌ అభిమానులంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జహీర్‌, సాగరికలు సోషల్‌ మీడియా వేదికగా కంగ్రాట్స్‌ చెబుతున్నారు. అలాగే టీమిండియా క్రికెటర్స్‌, సన్నిహితుల నుంచి జహీర్‌ ఖాన్‌కి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)