Published On:

CBSE 12th Class Results Out Now: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. అత్యధికంగా విజయవాడ

CBSE 12th Class Results Out Now: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. అత్యధికంగా విజయవాడ

CBSE 12th Class Results Out Now: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా విజయవాడ రీజియన్‌లో 99.60 శాతం, తిరువనంతపురంలో 99.32 శాతం, చెన్నైలో 97.39 శాతం నమోదైంది.

 

విద్యార్థులు ఫలితాల కోసం https://www.cbse.gov.in/ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

 

అలాగే, సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు 23,71,939 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు. ఇందులో 22,21,636 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

 

ఈ ఫలితాల్లో అత్యధికంగా త్రివేండ్రం రీజియన్ 99.79 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా 84.14 శాతంతో గౌహతి నిలిచింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు మొత్తం 7,837 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను cbse.gov.inలో చూడవచ్చు.