Man Playing with King Cobra: నడి రోడ్డుపై కింగ్ కోబ్రా.. తోక పట్టుకుని ఓ వ్యక్తి విన్యాసాలు

Man Playing with King Cobra Tale on Road: కింగ్ కోబ్రాలు ప్రపంచంలోనే అన్నీ పాముల కంటే అత్యంత విషపూరితమైనవి. వీటిని నల్లతాచు లేదా రాచనాగు అని కూడా పిలుస్తుంటారు. కింగ్ కోబ్రాలు 20 అడుగుల పొడువు ఉంటాయి. కింగ్ కోబ్రా మనిషిని కాటు వేస్తే 75 శాతం మృతిచెందే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా కాటువేస్తే దాన్ని విషం మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అయితే కింగ్ కోబ్రా దాదాపు 20 ఏళ్లు బతికి ఉంటుందని చెబుతుంటారు.నలుపు, గోధుమ రంగులను కలిగి ఉంటాయి. కొన్ని పాములు ఆకుపచ్చని రంగులో కూడా ఉంటాయి. మరికొన్ని పాములకు శరీరంపై చారలతో కూడిన పట్టీలు ఉంటాయి.
కొంతకాలంగా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కింగ్ కోబ్రాలు ఎక్కువగా అడవులు, దగ్గరగా ఉండే నివాస ప్రాంతాల్లో ప్రత్యక్షం అవుతుంటాయి. కొంతమందికి కింగ్ కోబ్రాలు కనిపించిన వెంటనే చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొంతమంది స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించి రక్షించేందుకు కృషిచేస్తుంటారు.
నడి రోడ్డుపై కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి పట్టుకుని విన్యాసాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ మధ్య కాలంలో కింగ్ కోబ్రాకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో విన్యాసాలకు దిగాడు. పాముతో యమా డేంజర్ అని తెలిసి కూడా దానితో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
వివరాల్లోకి వెళ్తే.. ఓ పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపైకి వచ్చింది. ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లి తోక పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నించగా కాటేసేందుకు ప్రయత్నించింది. ఆ వ్యక్తి భయపడకుండా పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించారు. కోబ్రాతో వ్యక్తి చేస్తున్న విన్యాసాలు చూసి వాహనదారులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.