IPL 2025 41st Match: కీలక పోరులో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు లేనట్టే..!

Mumbai Indian won by 7 Wickets in against Sunrisers Hyderabad in IPL 2025 41st Match: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. దీంతో సన్‌రైజర్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. వరుస ఓటమిలు ఎదురవుతున్నా ప్లేయర్ ఆటతీరులో జట్టులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతోపాటు సొంతగడ్డంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బొక్కబోర్లా పడుతున్నది. ఇక ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే విజయం బాట పట్టాల్సిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో చేతులెత్తేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆతిథ్య జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. హెన్రిచ్ క్లాసెన్ 44 బంతులో 71 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ 43 పరుగులు చేసి ఆదుకున్నాడు.
మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 చేసింది. ట్రెంట్ బౌల్ట్ నాలుగు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఛేదనను ముంబయి ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఓపెనర్ రోహిత్ 47 బంతుల్లో 70 అర్ధ సెంచరీ చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ సీజన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో ఓటమి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్ ఆశలు అడుగంటినట్టే!
కుప్పకూలిన టాపార్డర్..
హైదరాబాద్ అభిమానులు కాటేరమ్మ కొడుకులుగా పిలుచుకునే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల వైఫల్యం మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఈ ఏడాదిలో ఘోరంగా విఫలమవుతున్న ట్రావిస్ హెడ్ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తూ డకౌట్ అయ్యాడు. బౌల్ట్ రెండో ఓవర్లోనే హెడ్‌ను ఔట్ చేసి హైదరాబాద్ పతనానికి నాంది పలికాడు. అతడే తన మరుసటి ఓవర్లో అభిషేక్ (8)నూ ఔట్ చేశాడు. ముంబయి బౌలరు చాహర్ మూడో ఓవరులో ఇషాన్ కిషన్ (1) అత్యుత్సాహానికి పోయి పెవిలియన్‌కు వెళ్లాడు. నితీశ్ కుమార్‌రెడ్డి పరుగులు చేశాడు. అనికేత్ వర్మ 12 కూడా వారి బాటనే అనుసరించారు. 6 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 24/4. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో ఇదే అత్యంత చెత్త స్కోరు.