Published On:

DC vs RCB: ఢిల్లీపై ఆర్‌సీబీ ఘన విజయం

DC vs RCB: ఢిల్లీపై ఆర్‌సీబీ ఘన విజయం

DC vs RCB: ఢిల్లీపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అనే మ్యాచ్ లో విరాట్ సేన విజయ పథాకాన్ని ఎగురవేసింది. ఫైనల్ మ్యాచ్ ను తలపించేలా ఉత్కంఠను రేపింది.  14పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ నిర్ధేశించిన 163పరుగులను 18.3 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కృనాల్‌ పాండ్యా 47 బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51పరుగులు చేశాడు.

 

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 162 పరుగులను చేసింది. రాహుల్ 39 బంతుల్లో 41, స్టబ్స్ 18బంతుల్లో 34పరుగులు చేశారు. బ్యాటింగ్ కు అంతగా అనుకూలించని పిచ్ పై పరుగులు రాబట్టడానికి నానా అవస్థలు పడ్డారు. భువనేశ్వర్ 3 వికెట్లు, హేజిల్ వుడ్ 2, కృనాల్‌ 1 వికెట్లు తీశారు.

 

లక్ష్య చేధన
162 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు 4 ఓవర్లు ముగిసే సమయానికి 26పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో బెతెల్ (12), పడిక్కల్ (0)ను ఔట్ అయ్యారు. కరుణ్ మెరుపు త్రో తో పటిదార్ (6) రనౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కృనాల్‌ మొదట తడబడినా ఆ తర్వాత కోహ్లీతో కలిసి  38 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. సిక్సర్లతో చెలరేగి 47 బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 2016సీజన్ లో అర్థసెంచరీ చేసిన కృణాల్ మళ్లీ ఇప్పటికి చేయడం విశేషం. కోహ్లీ అవుట్ అయినా డేవిడ్ తో కలిసి టీంను గెలిపించాడు.

 

Delhi innings : పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజలవ్వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజర్వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్ వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విల్రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162.

భువనేశ్వర్ 4-0-33-3, యశ్ దయాళ్ 4-0-42-1, హాజల్ వుడ్ 4-0-36-2, సుయాశ్ శర్మ 4-0-22-0, కృనాల్ పాండ్యా 4-0-28-1.

Bengaluru innings: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165.

అక్షర్ పటేల్ 4-0-19-2, స్టార్క్ 3-0-31-0, ముకేశ్ కుమార్ 3.3- 0-51-0, విప్రోజ్ 1-0-12-0, కుల్దీప్ 4-0-28-0, చమీరా 3-0-24-1.