Published On:

Ritu Varma: ఓటీటీలో అయినా తెలుగమ్మాయి హిట్ కొడుతుందా.. ?

Ritu Varma: ఓటీటీలో అయినా తెలుగమ్మాయి హిట్ కొడుతుందా.. ?

Ritu Varma: అందాల ముద్దుగుమ్మ రీతూవర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్ గా మారడానికి నానా తంటాలు పడుతుంది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిస్తున్నా.. అమ్మడికి మాత్రం హిట్ అన్నదే దక్కలేదు.

 

పెళ్లి చూపులు లాంటి మంచి హిట్ కోసం అమ్మడు ఎదురుచూస్తోంది. గతేడాది స్వాగ్ సినిమాతో హిట్ అందుకుంటుందేమో అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇక దీంతో రీతూ.. ఓటీటీ బాట పట్టింది. ఈ మధ్యకాలంలో థియేటర్ లో కన్నా ఓటీటీలోనే సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. శివ కందుకూరి, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సిరీస్ దేవిక అండ్  డానీ. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో కోవై సరళ, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

కోవై సరళ చాలా కాలం తరువాత తెలుగులో నటిస్తుండడంతో ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తాజాగా ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిండైన చీరకట్టులో గొడుగు పట్టుకొని నవ్వుతూ రీతూ కనిపించగా.. ఆమె పక్కనే శివ రీతూనే చూస్తూ కనిపించాడు. పోస్టర్ తోనే సగం హైప్ తీసుకొచ్చారు.

 

జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.బి కిషోర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. రీతూ ఈ సిరీస్ కు అన్ని తానై ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తోంది.  త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాల్లో సక్సెస్ అందుకోలేని రీతూ వర్మ.. ఓటీటీలోనైనా హిట్ అందుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.