IPL 2025 : టాస్ గెలిచిన లఖ్‌నవూ.. స్కోర్ 92-3

IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లఖ్‌నవూ మొదట బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయసు ఉన్న ఆటగాడు. 14 ఏళ్ల 23 రోజులు మాత్రమే వయసు ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని తీసుకున్నారు. లక్నో జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్లు విజృంభిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ తన రెండో ఓవర్లలోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) పరుగులకే ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ (11)కు ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. రౌండ్ ది వికెట్ వేసిన సందీప్ శర్మ అతడిని ఎల్బీగా ఔట్ చేసి రాజస్థాన్‌కు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. దీంతో లక్నో పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.