IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

IPL 2025 : సొంత గడ్డపై బెంగళూరులో ఆర్సీబీని పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఈసారి తన సొంత మైదానం ముల్లాన్‌పుర్‌లో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బెంగళూరు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడింట 5 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉంది. బెంగళూరు జట్లు ఏడింట 4 మ్యాచ్‌లు గెలుపొంది 5 స్థానంలో కొనసాగుతోంది.