IPL 2025 : టాస్ గెలిచిన లఖ్‌నవూ.. ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ బ్యాటింగ్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్ మరో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టిన కెప్టెన్ కమిన్స్ సేన మరోసారి పరుగుల విందుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఎస్ఆర్‌హెచ్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితిశ్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికెత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ ఉన్నారు.
లక్నో జట్టు : ఎడెన్ మర్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదొని, శార్ధూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రథీ, ప్రిన్స్ యాదవ్ ఉన్నారు.