Pahalgam attack : పహల్గాం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.. ప్రకటించిన అసోం సర్కారు

Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత బిశ్వశర్మ మీడియాకు వెల్లడించారు.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులనే టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. అందులో 25 మంది భారతీయులు ఉన్నారు. మరొకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. ఘటన నేపథ్యంలో భారత్, పాక్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.