Published On:

Hot Water bath for Snakes: అక్కా.. మనదేవురు? పాములకు వేడి నీళ్లతో స్నానమా? క్రేజీ వుమెన్

Hot Water bath for Snakes: అక్కా.. మనదేవురు? పాములకు వేడి నీళ్లతో స్నానమా? క్రేజీ వుమెన్

Women Bathing Snakes in Hot Water: సాధారణంగా ఎవరైనా పాములు అంటేనే కిలోమీటర్ దూరం పరిగెడుతారు. అలాంటిది ఏకంగా పాములకు స్నానం చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఎందుకంటే చంటి పిల్లలకు తల్లులు స్నానం చేపిస్తారు కదా. కానీ ఈ వీడియోలో కింగ్ కోబ్రాలకు సంబంధించిన పాములకు ఓ మహిళ స్నానం చేపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఈ వీడియోలో పాములకు స్నానం చేపించడం చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటమ్మా చలికాలమా.. వేడి నీళ్లు పెట్టి మరి లాల పోస్తున్నారా అని కామెంట్స్ చేశారు. ఈ పాములు మీ పిల్లాలా అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఇంట్లోనే పాములను పెంచుకుంటున్నట్లు ఉన్నారా అని స్పందిస్తున్నారు.

 

ఇందులో ఆ మహిళ ఇంటి ఎదుట పాములకు స్నానం చేపిస్తుంది. ఏకంగా ఓ పాత్రను నిండుగా నీటితో నింపి పాములను అందులో ఉంచి .. పిల్లలకు శరీరం రుద్దినట్లు ఆ పాములకు ఏకంగా ఒళ్లు రుద్దుతూ కనిపించింది. అక్కడ పక్కన ఉన్న పాములు ఆశ్చర్యంగా మేము సిద్ధంగా ఉన్నాం.. మాకు స్నానం చేపించాలి అని చూడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

ఓ నెటిజన్ భలే పన్నీగా కామెంట్ పెట్టాడు. అందరి ఇళ్లల్లో చంటి పిల్లలకు స్నానం చేపిస్తున్న సమయంలో గారబం చేస్తుంటారు. అలానే ఇక్కడ పాములు కూడా అలానే చేస్తుంటాయని చెబుతున్నాడు. అమ్మా.. చల్లగా ఉంది. ప్లీజ్ వదిలేయ్.. తర్వాత చేస్తా.. అంటూ మారం చేస్తున్నాయని అని రాసుకొచ్చాడు. ఏంటమ్మా పాములకు లాల పోస్తున్నావా? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా పాతదే.. కానీ తెగ చూసేస్తున్నారు. ఎక్స్ ‌లో ఎస్‌ఆర్‌కే పేజీలో ఈ వీడియో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది.