Published On:

IPL 2025 : చెలరేగిన శుభ్‌మన్ గిల్, బట్లర్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 199

IPL 2025 : చెలరేగిన శుభ్‌మన్ గిల్, బట్లర్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 199

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్లు తలపడుతున్నాయి. పట్టికలో మొదటి స్థానంలో గుజరాత్ బ్యాటర్లు తగ్గేదేలే అంటున్నారు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ మైదానంలో కోల్‌క‌తా బౌలర్ల‌ను ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ (90), సాయి సుద‌ర్శ‌న్‌ (52) ఉతికేశారు. త‌మ జోడీ ప‌వ‌ర్‌ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం అందించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ సెంచ‌రీని చేజార్చుకున్నాడు. ఆఖ‌ర్లో బట్ల‌ర్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షారుఖ్ ఖాన్ (11 నాటౌట్) చెల‌రేగ‌గా, గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

 

టాస్ ఓడిన‌ గుజ‌రాత్‌కు ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ 55 బంతుల్లో 90 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, మూడు సిక్స‌ర్లు కొట్టాడు. సాయి సుద‌ర్శ‌న్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో చెలరేగాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా బౌండ‌రీల‌తో చెల‌రేగారు. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత జోరు పెంచిన గిల్ 34 బంతుల్లో అర్ధ‌ శ‌త‌కం పూర్తిచేశాడు. హ‌ర్షిత్ రానా బౌలింగ్‌లో సిక్స‌ర్ కొట్టిన సాయి అర్ధసెంచరీ కొట్టాడు. ఇద్దరూ మెరుపుల‌తో గుజ‌రాత్ స్కోర్ 100 దాటేసింది. ప్ర‌మాద‌క‌రంగా మారిన జోడీని విడ‌దీసేందుకు కోల్‌క‌తా కెప్టెన్ ర‌హానే బౌల‌ర్ల‌ను మార్చినా ఫ‌లితం లేక‌పోయింది.

 

ఎట్ట‌కేల‌కు ర‌స్సెల్ విజ‌య‌వంత‌మ‌య్యాడు. డేంజ‌ర‌స్ సుద‌ర్శ‌న్‌ ఔట‌య్యాక జోస్ బ‌ట్ల‌ర్ (41 నాటౌట్) జ‌త‌గా శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. బౌండ‌రీలు బాదిన అత‌డు రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. సెంచ‌రీకి చేరువైన గిల్‌ వైభ‌వ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడి రింకూ చేతికి దొరికాడు. త‌ర్వాత వ‌చ్చిన రాహుల్ తెవాటియా (0)ను హ‌ర్షిత్ ఔట్ చేశాడు. వైభ‌వ్ వేసిన 20వ ఓవ‌ర్లో బ‌ట్ల‌ర్ 2 ఫోర్లు కొట్ట‌గా, షారుఖ్ ఖాన్ (11 నాటౌట్) ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో గుజ‌రాత్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 198 పరుగులు చేసింది.

 

 

ఇవి కూడా చదవండి: