Rakul Preeth Singh: రెడ్ కలర్ లెహంగాలో రకుల్ రచ్చ.. అబ్బాబ్బా ఆ అందం ఏంట్రా బాబు

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.

మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రకుల్.. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు తెలుగులో ఆఫర్స్ ఉన్నప్పుడే రకుల్.. బాలీవుడ్ లో పాగా వేసింది.

జీరో సైజ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. పరాజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇక అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రకుల్ అందాల ఆరబోత చేయడం తగ్గించలేదు.

నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును అలరిస్తున్న రకుల్ తాజాగా రెడ్ కలర్ లెహంగాలో కనిపించి కనువిందు చేసింది.

ఎర్ర గులాబీ విచ్చుకున్నట్లు రకుల్ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.