Published On:

GT Vs SRH: చెలరేగిన ప్లేయర్లు.. గుజరాత్ స్కోర్ ఎంతంటే?

GT Vs SRH: చెలరేగిన ప్లేయర్లు.. గుజరాత్ స్కోర్ ఎంతంటే?

IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై గుజరాత్ ప్లేయర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభమన్ గిల్ 38 బంతుల్లోనే 76 పరుగులు చేయగా.. మరో ప్లేయర్ సాయి సుదర్శన్ (48) పరుగులతో రాణించారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లే లో 82 పరుగులు రాబట్టారు.

సాయి సుదర్శన్ ఔటైన తర్వాత క్రీజులోకి జాస్ బట్లర్ వచ్చాడు. తన బ్యాటింగ్ లో జాస్ బట్లర్ 37 బంతుల్లోనే 64 పరుగులతో చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లను ఆడుకున్నారు. 13 ఓవర్లలో గిల్ రనౌట్ అయినా తన జోరును తగ్గించలేదు. చివరి ఓవర్లలో సన్ రైజర్స్ కు వికెట్లు దక్కినా.. అప్పటికే గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్ కు మూడు వికెట్లు, అన్సారీ, కమ్మిన్స్ కు చెరో వికెట్ దక్కింది.

మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ముందు గుజరాత్ జట్టు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. అయితే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. డ్యూ ఫ్యాక్టర్ వస్తుందనే అంచనాలతో సన్ రైజర్స్ ఆటగాళ్లు రాణిస్తే మాత్రం మ్యాచ్ తప్పకుండా గెలుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.