Published On:

IPL 2025: మరో ఆసక్తికర పోరు.. ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ ఢీ!

IPL 2025: మరో ఆసక్తికర పోరు.. ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ ఢీ!

Rajasthan Royals vs Mumbai Indians 50th Match IPL Today: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ 50వ మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో గెలవగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడింది. అలాగే రాజస్థాన్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ముంబై 3వ స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 6 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది.

 

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 మ్యాచ్‌లు తలపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్‌ 14 మ్యాచ్‌లు గెలవగా.. ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌లు విజయం సాధించాయి. ఇరు జట్లలో ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక, రాజస్థాన్ రాయల్స్ 212 అత్యధిక స్కోరు చేయగా.. ముంబై ఇండియన్స్ 214 పరుగులు చేసింది. గత 2024లో ఇరు జట్లు తలపడిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.