Published On:

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డు.. కొడుకు కోసం భూమి అమ్మిన తండ్రి

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డు.. కొడుకు కోసం భూమి అమ్మిన తండ్రి

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డు సృష్టించాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ జట్టు తరఫున ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 14 ఏళ్ల కుర్రాడు సెంచరీ చేసిన ఐపీఎల్ ప్లేయ‌ర్‌గా రికార్డుకెక్కాడు. బీహార్‌‌కు చెందిన ఈ చిచ్చ‌ర‌పిడుగు ఐపీఎల్ వేలంలో 1.1 కోట్లకు దక్కించుకోగా, ఇప్పడు చ‌రిత్ర సృష్టించాడు.

 

వైభ‌వ్ సూర్య‌వంశీని క్రికెట‌ర్‌గా తీర్చిదిద్దేందుకు అత‌డి తల్లిదండ్రులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ కుర్రాడు 2011లో జన్మించాడు. ప్ర‌స్తుతం 14 ఏళ్ల 32 రోజులు ఉన్నాడు. వైభవ్ 12 ఏళ్లకే అండర్-19 యూత్ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. గుజ‌రాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచ‌రీ కొట్టేశాడు. వైభవ్ వీర బాదుడుకు గుజ‌రాత్ బౌల‌ర్లు ముఖం తేలేశారు.

 

బీహార్‌లోని స‌మ‌స్తిపుర్ స్వ‌స్థ‌లం..
వైభవ్‌ది బీహార్‌లోని స‌మ‌స్తిపుర్ గ్రామం. అక్క‌డి నుంచి అతడి క్రికెట్ జ‌ర్నీ ప్రారంభమైంది. టీ20 క్రికెట్‌కు కావాల్సిన టాలెంట్ అత‌డిలో ఉంది. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడేస్తున్నాడు. ప‌వ‌ర్‌ఫుల్ సిక్స‌ర్ల‌ను అల‌వోక‌గా కొట్టేస్తున్నాడు. పాట్నాలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో ఈ కుర్రాడు చాలా శ్రమించాడు. ప‌దేళ్ల వ‌య‌సు నుంచి రోజుకు 600 బంతులు ఆడేవాడు. 16 నుంచి 17 ఏళ్ల ఉన్న బౌలర్లను ప్రాక్టీస్‌లో ఎదుర్కొకునేవాడు. తండ్రి సంజీవ్ సూర్య‌వంశీ కొడుకు కోసం టిఫిన్ బాక్స్ తెచ్చేవాడు. ప్రాక్టీస్ చేస్తున్న కుర్రాళ్ల కోసం అదనంగా 10 టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు.

 

తండ్రి ఏకంగా భూమినే అమ్మేశాడు..
వైభ‌వ్ సూర్య‌వంశీ క్రికెట్ ఆశ‌లను తీర్చేందుకు తండ్రి త‌న భూమిని అమ్మేశాడు. తన వ్య‌వ‌సాయ పొలాన్ని అమ్మి కొడుకు కోసం ఖ‌ర్చు చేశాడు. సోమవారం గుజ‌రాత్‌‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సెంచరీ కొట్టాడు. అందులో 11 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స‌ర్ కొట్టాడు. భారీ షాట్లు ఈజీగా ఆడేస్తున్నాడు. మూడు మ్యాచుల్లో 151 పరుగులు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ స‌గ‌టు 75.50 కాగా, అతడి స్ట్ర‌యిక్ రేట్ 222.5గా ఉంది.

 

 

ఇవి కూడా చదవండి: