IPL 2025: ఉత్కంఠ పోరులో ఢిల్లీపై కోల్‌కతా సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్ ఆశలు ఉన్నట్లేనా?

KKR won The Match by Against DC in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా.. ఢిల్లీ జట్టును మట్టికరిపించి నెగ్గింది. ఈ మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఖాతాలో నాలుగో విజయం నమోదు కాగా, ఢిల్లీకి నాలుగో ఓటమి కావడం విశేషం.
కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్లు గురబాజ్(26), నరైన్(27), అజింక్య రహానె(26), రఘువంశీ(44), రింకూ సింగ్(36) రాణించగా.. వెంకటేశ్ అయ్యర్(7) విఫలమయ్యాడు. చివరిలో రస్సెల్(17)మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కోల్‌కతా 204 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. నిగమ్, అక్సార్ చెరో 2 వికెట్లు తీశారు.
205 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడి ఓడింది. ఈ మేరకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్(62), అక్షర్ పటేల్(43) రాణించగా.. మిగతా బ్యాటర్లు అభిషేక్(4), కరుణ్ నాయర్(15), రాహుల్(7), అశుతోష్ శర్మ(7) విఫలమయ్యారు. చివరిలో విప్రాజ్(38)పోరాడినా ఫలితం లేకపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ 2 వికెట్లు తీశారు.