RCB won by 11 Runs: బెంగళూరు ఖాతాలో ఆరో విజయం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓటమి

Royal Challengers Bengaluru won by 11 runs Against Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన 42వ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు ఖాతాలో ఆరో విజయం నమోదైంది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(26, 23 బంతుల్లో 4 ఫోర్లు) మంచి శుభారంభం అందించగా.. విరాట్ కోహ్లీ(70, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. హసరంగ బౌలింగ్‌లో సాల్ట్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి హెట్‌మయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్(50, 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో బెంగళూరు భారీ స్కోరు దిశగా సాగింది. రెండో వికెట్ 156 పరుగుల వద్ద కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే పడిక్కల్, రజత్ పాటీదర్(1) ఔట్ అయ్యారు. ఇక, చివరిలో టిమ్ డేవిడ్(23,15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్), జితేశ్ శర్మ(20, 10 బంతుల్లో 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో 200 పరుగుల మార్క్ దాటింది.
206 పరుగుల లక్ష్యఛేదనను రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి బలమైన పునాది వేసింది. వైభవ్ సూర్యవంశీ(16), జైస్వాల్(49, 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు ఇద్దరూ మంచి శుభారంభం అందించిన చివరిలో బ్యాటర్లు విఫలమయ్యారు. 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జైస్వాల్, నితీశ్ రాణా(28),, పరాగ్(22)లను బౌలర్లు పెవిలియన్ చేర్చారు. చివరిలో ధ్రువ్ జురెల్(47, 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం దక్కలేదు. హేజిల్‌వుడ్ సూపర్ బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 19వ ఓవర్‌లో హేజిల్‌వుడ్ జురెల్‌తో పాటు ఆర్చర్‌ను ఔట్ చేశాడు. చివరి ఓవర్‌లో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బెంగలూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్య 2 వికెట్లు, భువనేశ్వర్, యశ్ దయాళ్ తలో వికెట్ తీశారు.