Last Updated:

God Father: ఓవైపు పాజిటివ్, మరోవైపు నెగటివ్.. గాడ్ ఫాదర్ రివ్యూ ఏంటో చూసేద్దాం

God Father: ఓవైపు పాజిటివ్, మరోవైపు నెగటివ్.. గాడ్ ఫాదర్ రివ్యూ ఏంటో చూసేద్దాం

Cast & Crew

  • చిరంజీవి (Hero)
  • నయనతార (Heroine)
  • సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని (Cast)
  • మోహన్ రాజా (Director)
  • రాంచరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ (Producer)
  • తమన్ (Music)
  • నిరవ్ షాష్ (Cinematography)
3.5

God Father: మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ మూవీ వచ్చేసింది. కాగా ఈ మూవీ రివ్యూ ఏంటో ఓ సారి చూసేద్దామా. చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్. సత్యదేవ్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రల్లో నటించగా నయనతారా ఈ సినిమాలో చిరంజీవితో జంటకట్టింది. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన కొణిదెల సురేఖ ఈ మూవీని సమర్పించారు. అయితే అమెరికాలో ‘గాడ్ ఫాదర్’ ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే అమెరికాలో ఈ సినిమాకు హిట్ టాక్ లభిస్తోంది.

ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అదుర్స్

‘గాడ్ ఫాదర్’ చిత్రానికి ఆన్ స్క్రీన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అని ఫ్యాన్స్ అంటున్నారు. అంటే ఈ సినిమాకు తమన్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి నటన, తమన్ సంగీతం సూపర్ అని చెప్తున్నారు. కథలో కోర్ పాయింట్ చెడగొట్టకుండా సినిమాలో చాలా బాగా మార్పులు చేశారనే టాక్ వినిపిస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అని, మెగాస్టార్ మళ్ళీ హిట్ కొట్టారని అభిమానులు నెట్టింట హల్చల్ చేస్తున్నారు.

నెగిటివ్ టాక్ కూడా
‘గాడ్ ఫాదర్’కు హిట్ టాక్‌తో పాటు నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ట్విట్టర్ వేదికగా కొందమంది ప్రజలు సినిమా ఏవరేజ్ అని ట్వీట్ చేస్తున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు సంతోషాన్ని ఇస్తుందనేది ఎక్కువ మంది చెప్పే మాట.

కాగా ఈ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’కు రీమేక్. తెలుగులో డబ్ అయిన సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం ఏమిటి? చిరంజీవికి ధీటైన ప్రతినాయకుడిగా సత్యదేవ్ సరిపోతాడా? అంటూ ఈ సినిమాపై అనేక ప్రశ్నలు వినిపించాయి.

ఇదీ చదవండి: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ

ఇవి కూడా చదవండి: