Published On:

28°C Movie Review: లవ్ అండ్ థ్రిల్లింగ్.. కొత్త ప్రేమకథ ఆకట్టుకుందా!

28°C Movie Review: లవ్ అండ్ థ్రిల్లింగ్.. కొత్త ప్రేమకథ ఆకట్టుకుందా!

28 Degree Celsius Movie Review: నవీన్ చంద్ర, శాలిని వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘28°C’. ఈ సినిమాను పొలిమేర 1, పొలిమేర 2 వంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించగా.. సాయి అభిషేక్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా పనిచేశారు. వీరితో పాటు వి.జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్రలు నటించారు. తాజాగా, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:
కార్తీక్(నవీన్ చంద్ర) ఓ అనాథ. కార్తీక్ ఓ కాలేజీలో మెడిసిన్ చదువుతుండగా.. అదే కాలేజీలో అతను క్లాస్‌మెట్‌ అయినటువంటి అంజలి(షాలిని)ని ఇష్టపడుతుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఈ సమయంలో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెబుతారు. ఈ ప్రేమ వివాహం అంజలి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే అంజలి అనారోగ్యానికి గురవుతోంది. ఆమె 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుంది. ఈ సమయంలో కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వీరు విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంజలి, కార్తీక్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:
కార్తీక్, అంజలి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత హీరో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా 6 ఏళ్ల క్రితం విడుదల కావాల్సింది. కానీ 2025లో రిలీజ్ చేయడంతో పాటు ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ సక్సెస్ అయ్యారు. అయితే అంజలికి ఉన్న అరుదైన డిసిస్ గురించి కార్తీక్ ఆరాటపడడంతో పాటు వ్యాధి తగ్గించుకునేందుకు విదేశాలకు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లాక ఇద్దరి జీవితాల్లో పలు సంఘటనలు ఉత్కంఠను రేపుతాయి. అంజలిని బతికించుకునేందుకు కార్తీక్ పడే ఆరాటం అందరి హృదయాన్ని కదిలిస్తుంది. క్లైమాక్స్‌లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరుగుతోంది. ఈ వ్యాధి ఉంటుందా అని ప్రతి ప్రేక్షకుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. కానీ ఇలాంటి వ్యాధులు కూడా అరుదుగా ఉంటాయని తెలిసే అవకాశం ఉంది.

నటీనటులు:
‘28°C’ సినిమాలో హీరో కార్తీక్ నవీన్ చంద్ర పాత్రలో చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంది. ఓ ప్రేమికుడిగా కథలో ఇమిడిపోయాడు. అలాగే హీరో చాలా యంగ్‌గా కనిపించాడు. హీరోయన్ శాలిని.. అంజలి పాత్రకు కరెక్ట్‌గా సరిపోయింది. పక్కింటి అమ్మాయిలో చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇద్దరూ ప్రేమికులుగా తనదైన పాత్రలో మెప్పించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంజలి నటనకు ఫిదా కావాల్సిందే. అలాగే ప్రియదర్శి, వైవా హర్ష, అభయ్ బేతిగంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:
‘28°C’ సినిమాలో నిర్మాణ విలువలు చాలా అట్రాక్ట్‌గా ఉన్నాయి. బీజీఎం ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మంచి సినిమాను తెరకెక్కించడంలో సఫలమయ్యారు. విభిన్నమైన కథను పరిచయం చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:
డీసెంట్ థ్రిల్ మూమెంట్స్
నటీనటుల యాక్టింగ్
మ్యూజిక్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ స్టోరీ సాగదీత
ఆకట్టుకోని పాటలు, సీన్స్

రేటింగ్: 2.75/5.

ఇవి కూడా చదవండి: