Published On:

Michael Vaughan on Virat Kohli: బీసీసీఐకి మాజీ క్రికెటర్ రిక్వెస్ట్.. విరాట్ కోహ్లీకే టెస్ట్ పగ్గాలు

Michael Vaughan on Virat Kohli: బీసీసీఐకి మాజీ క్రికెటర్ రిక్వెస్ట్.. విరాట్ కోహ్లీకే టెస్ట్ పగ్గాలు

England Former Cricketer Michael Vaughan about Virat Kohli Test Captaincy: భారత స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటన ఉంది. ఈ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.

 

కాగా, మరో స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రోహిత్ బాటలోనే విరాట్ వెళ్లేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిర్ణయం మేరకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే 5 టెస్ట్ సిరీస్‌లో కీలకం కానున్నాడు.

 

ఇంగ్లాండ్‌తో టీమిండియా త్వరలో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించాడు. ఇటీవల రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడని, కావున విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగించాలని మైకేల్ వాన్ ఎక్స్ వేదికగా బీసీసీఐకి సూచించాడు. అదే విధంగా, టెస్ట్ క్రికెట్‌లో మరింత కాలం ఆడాలని మాజీ క్రికెటర్లు సిద్దూ, అంబటి రాయుడు, బ్రియాన్ లారా తదితరులు సూచిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పడంతో విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో వెళ్లాలనే నిర్ణయంపై ఎలాంటి వివరణ లేదని తెలుస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే నిర్ణయం లేదా కొనసాగే ఆలోచన వంటి విషయాలపై ఏమీ చెప్పలేదని తెలుస్తోంది. కాగా, అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో మరింత కాలం కొనసాగితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టెస్ట్ టీం ఎంపికకు ముందే విరాట్ కోహ్లీ ఫైనల్ నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉంది.