Last Updated:

Ponniyin Selvan-1: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ

Ponniyin Selvan-1: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ

Cast & Crew

  • విక్రమ్ (Hero)
  • ఐశ్వర్యరాయ్, త్రిష (Heroine)
  • కార్తి, జయం రవి (Cast)
  • మణిరత్నం (Director)
  • లైకా ప్రొడక్షన్స్ (Producer)
  • ఏ ఆర్ రెహమాన్ (Music)
  • రవి వర్మన్ (Cinematography)
3

Tollywood: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్ 1. ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా పాన్ ఇండియా లెవల్లో మన ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో పొన్నియన్ సెల్వన్ 1 ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఇక ఈ కథలోకి వస్తే ఇది పూర్తిగా తమిళంకు చెందిన కథ. ఆ పేర్లు కూడా అంత తమిళంలో ఉండటంతో మనకి కనెక్ట్ అవ్వడానికి కొంచం సమయం పడుతుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే ఒక నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తియ్యడం తన లైఫ్ టైమ్ డ్రీమ్ అంటూ మణిరత్నం గారు ప్రకటించారు. బాహుబలి సినిమాను ప్రేక్షకులు ఎంతో గానో ఆదరించారు. అదే నేపథ్యంలో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చెయ్యాలనే ఆలోచన వచ్చిందని ఆ మధ్య మీడియా ముందుకూడా పేర్కొన్నారు.

ఈ నెటిజన్స్ రివ్యూలను ఒకసారి పరిశీలిస్తే, సినిమా ఐతే బాగానే ఉందని తెలుస్తోంది. ఐతే మన తెలుగు వారికి కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం ఐతే పడుతుంది. ఈ సినిమా ఎక్కువగా తమిళ వారికి నచ్చే అవకాశం ఉంది. మన తెలుగు వారు కల్కి రాసిన నవలలు ఎవరైతే చదువుతారో, వారికి వెంటనే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం. ముందు ముందు టాక్ మారే అవకాశం ఐతే లేకపోలేదు. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూద్దాం.

 

ఈ సినిమాను తెలుగులో మంచి బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 3.5 కోట్ల మేరకు బిజినెస్ జరగగా, సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2 కోట్ల మేరకు బిజినెస్ జరగగా, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.5 కోట్ల మేరకు రేంజ్‌లో బిజినెస్ జరిగినట్టు తెలిసిన సమాచా రం. మొత్తం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ 10.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తే హిట్ అనిపించుకుంటుంది.

ఇవి కూడా చదవండి: