Published On:

Discount on Vivo Y300 5G: పోతే అనొద్దు.. వివో 5జీ స్మార్ట్‌ఫోన్ భారీగా డిస్కౌంట్.. ఇది అస్సలు ఊహించనిది!

Discount on Vivo Y300 5G: పోతే అనొద్దు.. వివో 5జీ స్మార్ట్‌ఫోన్ భారీగా డిస్కౌంట్.. ఇది అస్సలు ఊహించనిది!

Huge Discount on Vivo Y300 5G Mobile: వీవో Y300 5G స్మార్ట్‌ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ దీనిని మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఫోన్‌లో 8జీబీ వరకు ర్యామ్ ఉంది. దీనిని 16జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫోటోగ్రఫీ కోసం 50మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 32మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Vivo Y300 5G Price

వీవో Y300 5G ఫోన్ భారతదేశంలో 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఈ రెండు వేరియంట్ల లాంచ్ ధర వరుసగా రూ. 21,999,రూ. 23,999. కొన్ని నెలల తర్వాత, కంపెనీ ఈ మొబైల్ ధరను రూ.1,000 తగ్గించింది, ఆ తర్వాత దాని రేటు వరుసగా రూ.20,999, రూ.22,999 అయింది. అమెజాన్ నుంచి ఆఫర్లపై ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

 

Vivo Y300 5G Offers

8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 20,999 కాగా, రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించింది. దీని తర్వాత ధర రూ. 18,999. 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.22,999 కాగా, రూ. 2,000 తగ్గింపు అందిస్తుంది. ఇప్పుడు రూ. 20,999కి కొనుగోలు చేయచ్చు. అలానే హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2000 అదనపు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆపర్లన్ని మే 31 మాత్రమే ఉంటాయి.

 

Vivo Y300 5G Specifications

Vivo Y300 5G ఫోన్ 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల FullHD పంచ్-హోల్ స్క్రీన్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ బ్రైట్‌నెస్ అవుట్‌పుట్‌ను అందించే E4 AMOLED స్క్రీన్ ప్యానెల్‌పై తయారు చేశారు. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. ఫోన్ Funtouch OS 14తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ప్రాసెసింగ్ కోసం, ఈ మొబైల్ 4నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌ల ఆధారంగా క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ అందించారు, ఇది 1.95GHz నుండి 2.2GHz క్లాక్ వేగంతో పనిచేస్తుంది.

 

Y300 5G ఫోన్ 8GB RAM తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ మొబైల్ ర్యామ్‌ను అదనంగా 8GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 128జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఈ Vivo ఫోన్ LPDDR4X RAM + UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరాకు సపోర్ట్ ఇస్తుంది. దీని వెనుక ప్యానెల్‌లో, F/1.79 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 మెయిన్ సెన్సార్ ఉంది, ఇది F/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ బోకె లెన్స్‌తో కలిసి పనిచేస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ F/2.45 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

 

Vivo Y300 5G ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీ ఉంది. ఈ పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి, ఈ మొబైల్ 80W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 8 5G బ్యాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌లో 5GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, OTG సపోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో వెట్-హ్యాండ్ టచ్ ఫీచర్ కూడా అందించారు, దీని కారణంగా తడి చేతులతో కూడా మొబైల్‌ను ఆపరేట్ చేయచ్చు.