Published On:

Mega 157: ఠాగూర్ జోడీని రిపీట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ?

Mega 157: ఠాగూర్ జోడీని రిపీట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకడు కావడంతో చిరుకు కూడా అనిల్ మంచి హిట్ నే ఇవ్వబోతున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వచ్చేసింది.

 

అంతేనా ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం కూడా టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అనిల్.. మెగా 157 కోసం అభిమానులు షాక్ అయ్యేలా మరో సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో చిరు సరసన జ్యోతికను తీసుకుంటున్నారని టాక్.

 

సూర్యతో పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పుడు ఆమెను మరోసారి తెలుగుకు రీఎంట్రీ ఇప్పించే ప్లాన్ చేస్తున్నాడట. చిరు, జ్యోతిక ది కూడా హిట్ కాంబినేషనే. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఠాగూర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జంటను అనిల్ రిపీట్ చేస్తున్నాడు.

 

త్వరలోనే జ్యోతికను మేకర్స్ అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నారట. ఇప్పటికే విశ్వంభర కోసం స్టాలిన్ లో నటించిన త్రిషను తీసుకున్న చిరు.. ఇప్పుడు మెగా 157 కోసం జ్యోతికను సెలెక్ట్ చేయడం బావుందని, కుర్ర హీరోయిన్ల వెంట పడకుండా.. సీనియర్ హీరోయిన్లను తీసుకోవడం బావుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట ఈసారి ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.