Last Updated:

Rahul Gadhi: ‘ఒకవేళ ఆ దేవుడే వచ్చి మోదీ పక్కన కూర్చుంటే.. ’ అమెరికాలో రాహుల్ గాంధీ సెటైర్లు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Rahul Gadhi: ‘ఒకవేళ ఆ దేవుడే వచ్చి మోదీ పక్కన కూర్చుంటే.. ’ అమెరికాలో రాహుల్ గాంధీ సెటైర్లు

Rahul Gadhi: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోదీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ సర్కార్ భారత ప్రజలను భయపెడుతోందన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని.. మోదీ దేవుడికే పాఠాలు నేర్పే ఘనడని రాహుల్ విమర్శించారు.

 

 

మోదీ మాటలకు దేవుడు కూడా..(Rahul Gadhi)

తమకే అంతా తెలుసు అనే భ్రమలో ఉన్న వ్యక్తులు ఇండియా లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. వాళ్లు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారని.. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా సైన్యానికి కూడా యుద్ధాన్ని నేర్పిస్తారని.. దేవుడితో కూర్చుంటే ఆయనకే పాఠాలు చెప్పగల సమర్థులు వారని తీవ్ర స్తాయిలో మండిపడ్డారు.

ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప ఉదాహరణ అన్నారు. ఒకవేళ, మోదీ ఆ దేవుడి పక్కన ఉంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో దేవుడికే చెప్తారన్నారు. మోదీ మాటలకు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారంటటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.

 

పక్కదోవ పట్టించేందుకే  సెంగోల్

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం , విద్యారంగంలోని సమస్యలు తీర్చలేకపోతున్నారని మండిపడ్డారు. వాటన్నింటనీ పక్కదోవ పట్టించారని.. పార్లమెంట్ సెంగోల్ పై అందరూ మాట్లాడుకునేలా చేశారన్నారు. రాజ్యసభ, లోక్ సభలో సీట్లు పెరిగే అంశంపైనా రాహుల్ తన అభిప్రాయాలు వెల్లడించారు. అదే విధంగా భారత్ జోడో యాత్ర గురించి కూడా రాహుల్ ప్రస్తావించారు. ‘భారత జోడో యాత్రను మోదీ సర్కార్ అడ్డుకోవాలని చూసింది. కానీ వాళ్లు అనుకున్నది సాధ్యం కాలేదు. జోడో యాత్రలో దేశమంతా కలిసి నాతో నడించింది.

భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ప్రేమాభిమానాలు చూపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను తట్టుకోవాలంటే ఒకప్పటి రాజకీయ వ్యూహాలు పనిచేయవనే జోడో యాత్ర ప్రారంభించా’ అని రాహుల్ తన జోడో యాత్ర గురించి వివరించారు. కాగా, జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారని కాంగ్రెస్‌ వెల్లడించింది.