OnePlus 13s Launch Date: యాపిల్‌కు గట్టి షాక్.. వన్‌ప్లస్ నుంచి బుడ్డ ఫోన్.. ఐఫోన్ 16eకి కష్టమే..!

OnePlus 13s Launch Date: వన్‌ప్లస్ తన కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ OnePlus 13s తో టెక్ ప్రపంచాన్ని బ్లాస్ట్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 2025లో భారతదేశంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు, దీని ధర సుమారు రూ.50,000 కావచ్చు. ఈసారి కంపెనీ ప్రీమియం ఓఎల్ఈడీ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, కొత్త “ప్లస్ కీ” బటన్ వంటి ప్రత్యేక ఫీచచర్లు ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ డిజైన్ ఖచ్చితంగా కాంపాక్ట్‌గా ఉంటుంది, కానీ ఇందులో హై-ఎండ్ పెర్ఫార్మెన్స్, శక్తివంతమైన కెమెరా సెటప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది యాపిల్ తాజా స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16e కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
OnePlus 13s Price
వన్‌ప్లస్ 13ఎస్ భారతదేశంలో లాంచ్ కానుంది. దీని టీజర్‌లు ఇప్పటికే అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక సైట్‌లో లైవ్ అవుతున్నాయి. ఖచ్చితమైన లాంచ్ తేదీ తెలియనప్పటికీ జూన్ 10 తర్వాత భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కావచ్చని పేర్కొన్నాయి. ధర దాదాపు రూ. 50,000గా ఉండనుంది.
OnePlus 13s Specifications
వన్‌ప్లస్ 13s మొబైల్‌లో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని చెబుతున్నారు. దీనిలో 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్ 90W ఛార్జింగ్‌తో 6260mAh బ్యాటరీని అందించారు. ఫోన్‌లో అతిపెద్ద మార్పు దాని అలర్ట్ స్లయిడర్‌తో ఇప్పుడు దాని స్థానంలో ఐఫోన్ లాగా ఫోన్‌లో కొత్త “ప్లస్ కీ” బటన్ ఉండనుంది.
ఈ బటన్ కస్టమ్ షార్ట్‌కట్‌లు లేదా కంట్రోల్స్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. మొబైల్‌లో రెండు 50మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం 2x ఆప్టికల్ జూమ్‌తో 50మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉండచ్చు. ముందు కెమెరా వివరాలు ఇంకా అధికారికంగా తెలియనప్పటికీ, లీక్‌లు ఇందులో 16మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుందని సూచిస్తున్నాయి.వన్‌ప్లస్ 13s మొబైల్ మూడు అందమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇందులో పింక్, బ్లాక్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. బ్రాండ్ అధికారిక హ్యాండిల్ X (గతంలో ట్విట్టర్) ద్వారా షేర్ చేసిన టీజర్ వీడియోలో ఇవి వెల్లడయ్యాయి.