North Korea: కిమ్ జోంగ్ కు షాక్.. తొలి నిఘా శాటిలైట్ ప్రయోగం విఫలం
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ కు గట్టి ఎదురదెబ్బ తగిలింది. ఈ దేశం మొదటి సారి చేపట్టిన అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగం (Spy satellite) విఫలమైంది. ఈ స్పై శాటిలైట్ సముద్రంలో కూలిపోయింది. ఉపగ్రహ ప్రయోగం విఫలంపై ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది.
శాటిలైట్ ను తీసుకెళ్తున్న రాకెట్ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్ ను కోల్పోయిందని తెలిపింది. తమ సైంటిస్టులు ఈ వైఫల్యానికి గల కారణాలపై అధ్యయనం చెస్తున్నారని చెప్పింది. ఈ ఉపగ్రహ శకలాలు కొరియా సముద్ర జలాల్లో పడినట్టు తెలిపింది. ఫియాన్ గాన్ ప్రావిన్స్ లోని సోమే శాటిలైట్ లాంచింగ్ గ్రౌండ్ నుంచి మల్లిజియాంగ్ -1 నుంచి శాటిలైట్ ను ప్రయోగించారు.
రెండో లాంచ్ కు సిద్ధం
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
(సముద్రంలో ఉపగ్రహం శకలాలు)
దక్షిణ కొరియా, జపాన్‌లో హెచ్చరికలు(North Korea)
స్పై శాటిలైట్ విఫలం అవ్వడం తీవ్ర భయాందోళనలకు కారణంమైంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో ఉపగ్రహ శకలాలు ఎక్కడ పడతాయో అని దక్షిణ కొరియా వణికిపోయింది. దీంతో ఆ దేశ రాజధాని సియెల్ లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ రాకెట్ కూలిపోయే సమయంలో అసాధారణ గమనంలో ప్రయాణించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. దీనిపై అమెరికాతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. కొన్ని రాకెట్ శకలాలను సపైతం కూడా దక్షిణ కొరియా స్వాధీనం చేసుకొంది. మరో వైపు జపాన్ కూడా ఈ విషయంపై స్పందించి. ఏ వస్తువు కూడా అంతరిక్ష కక్ష్యలోకి చేరుకోలేదని తెలిపింది. తమ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.
ఉత్తరకొరియా రాకెట్ ప్రయోగించిన విషయం తెలియగానే దక్షిణ కొరియా, జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అలెర్ట్ చేశారు. సియోల్ ప్రజలకు స్పీకర్స్, మొబైల్ మెసేజ్ ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు జపాన్ ఒకినావాలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. ఈ ప్రాంతం ఉత్తరకొరియా రాకెట్ గమనమార్గంలో ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది. ప్రజలను భవనాలు, అండర్ గ్రౌండ్‌ల్లోకి వెళ్లమని హెచ్చరించింది
ఖండించిన అగ్రరాజ్యం(North Korea)
కాగా, నార్త్ కొరియా ప్రయోగాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడమేనని పేర్కొంది. దీనిపై జాతీయ భద్రతా సలహా మండలి ప్రతినిధి ఆడమ్ హోడ్స్ మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్, నేషనల్ సెక్యూరిటీ టీమ్ అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములతో సమన్వయం చేసుకొంటున్నారని తెలిపారు.