Paisawala: యంగ్ సెన్సేషన్ శ్రీలీల చేతుల మీదుగా ‘పైసావాలా’ పోస్టర్ రిలీజ్

Sreeleela Launch Paisawala Poster: రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’. ఈ సినిమాకి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తుండగా.. అనురాజు ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను యంగ్ సెన్సేషన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకి నగేష్ గౌరీష్ సంగీతం అందిస్తుండగా.. గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫరీ, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.