Justice BR Gavai: సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా బీఆర్ గవాయ్.. ఆయన ఎవరేంటే?

Justice BR Gavai as Chief Justice of India: రాష్ట్రపతి భవన్‌లో కొత్త సీజేఐ ప్రమాణం స్వీకారం చేశారు. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరయ్యారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 మే 24 నుంచి కొనసాగుతున్నారు. ఈ సమయాల్లో చరిత్రాత్మక తీర్పులను ఇచ్చారు. అయితే ఈయన సీజేఐగా 6 నెలలు కొనసాగనున్నారు. కాగా, ఆయన నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన రెండో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిగా భూషణ్ రామకృష్ణ గవాయ్ రికార్డుకెక్కారు.
గవాయ్ పూర్తిపేరు భూషన్ రామకృష్ణ గవాయ్ కాగా, ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. 1987-90 వరకు స్వతంత్ర న్యాయవాదిగా పనిచేశారు. 2000లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేయగా.. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. 2005లో ఆయన పూర్తిస్థాయి న్యాయవాదిగా ప్రమోషన్ లభించింది. 2019 మే 24న సుప్రీం న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఇప్పటివరకు 150కు పైగా తీర్పులు చేశారు.