UPSC chairman: యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్

Former defence secretary Ajay Kumar Appointed UPSC chairman: యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం యూపీఎస్‌సీ కొత్త ఛైర్మన్ నియామకంపై ఆమోదం తెలిపారు. కాగా, అంతకుముందు ఉన్న యూపీఎస్‌సీ ఛైర్మన్ ప్రతీ సుదీన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగిసింది. అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా అజయ్ కుమార్ నియమించింది.
ఇదిలా ఉండగా, 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కుమార్.. కేరళ క్యాడర్‌కు చెందిన వ్యక్తి. గతంలో ఆయనపై సర్వీస్ రికార్డులు ఉన్నాయి. 2019 ఆగస్టు నుంచి 2022 అక్టోబర్ వరకు డిఫెన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను నియమించేందుకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నిర్వహించే యూపీఎస్‌కి ఛైర్మన్ కీలకంగా వ్యవహరించనున్నారు.
ఈ యూపీఎస్‌సీలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఇంకా ఇద్దరు సభ్యులకు సంబంధించిన రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక, యూపీఎస్‌సీ ఛైర్మన్ పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. అలాగే 65 ఏళ్లకు మించకూడదు.
అయితే, ప్రీతి సుడాన్ పదవీ కాలం ఏప్రిల్ 29న ముగిసింది. అంతకుముందు మనోజ్ సోని ఆకస్మిక రాజీనామా చేశారు. ఇంకా పదవీ కాలం ఉండగానే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా ఆ తర్వాత ప్రతీ సూడన్ యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియామకమైన సంగతి తెలిసిందే. కాగా, సూడాన్.. 2024 జులైలో ఆరోగ్య కార్యదర్శిగా చేశారు.
అంతకుముందు, మనోజ్ సోని 2017 జూన్ నుంచి 2023 మే వరకు కమిష్ సభ్యురాలిగా ఉన్నారు. ఆ సమయంలో సోనీ రాజీనామాపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ప్రభుత్వపై విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- Operation Sindoor : పీవోకే పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం : విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్